సూర్యాపేట- విజయవాడ జాతీయ రహదారిపై ( సడక్ బంద్ ) భారీ రాస్తారోకో.అఖిలపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
సూర్యాపేట,అక్టోబర్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:టిఎస్పిఎస్సి ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా సభ్యులను తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ దగ్గర సూర్యాపేట- విజయవాడ ప్రధాన జాతీయ రహదారి పై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో( సడక్ బంద్) భారీ రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్,తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్,సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు కరీం మాట్లాడుతూ టిఎస్పిఎస్సి నిర్వహించిన పరీక్షా ఫలితాల లీకేజ్,అమ్మకం వ్యవహారాలతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు.16 పరీక్ష పత్రాలు లీక్ కావడమే కాకుండా వాటిని అమ్ముకున్నారని ఆరోపించారు. కమీషన్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను నియమించాలని,కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని కోరారు.డీఎస్సీ పోస్టుల సంఖ్యను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 కు పెంచాలని( బ్యాక్ లాక్ పోస్టులు కాకుండా అదనంగా) డిమాండ్ చేశారు. పరీక్షల రద్దుకు కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు.విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన కేసిఆర్ రానున్న ఎన్నికల తర్వాత రాజకీయ నిరుద్యోగిగా మారక తప్పదని విమర్శించారు.అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
టిఎస్పిఎస్సి ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా సభ్యులను తొలగించాలి:అఖిలపక్ష పార్టీలు
RELATED ARTICLES



