టిఏఈఓఎస్ యూనియన్ సూర్యాపేట జిల్లా బాడీ ఎన్నిక..
Mbmtelugunews//సూర్యాపేట, జనవరి 08(ప్రతినిధి మాతంగి సురేష్): టీఎన్జీవో ఆధ్వర్యంలో తెలంగాణ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (టిఏఈఓఎస్) యూనియన్ సూర్యాపేట జిల్లా బాడీనీ గురువారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఎలక్షన్ ఆఫీసర్లుగా టీఎన్జీవో జనరల్ సెక్రటరీ దున్న శ్యామ్, ఉమ్మడి నల్గొండ జిల్లా టిఏఈఓఎస్ జిల్లా అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది.

ఈ సందర్బంగా టిఏఈఓఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి గా పెద్దపంగ ప్రణయ్ (ఏఈఓ- దుపహాడ్),
జనరల్ సెక్రటరీ గా ధరావత్ మనోజ్ కుమార్ (ఏఈఓ- పొనుగోడు), ట్రేజరర్ గా షేక్ ముస్తఫా (ఏఈఓ – లింగగిరి), అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఆతుకూరి ఉప్పయ్య (ఏఈఓ – బృందావనపురం), యూనియన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. ఈ కార్యక్రమం లో నల్గొండ టీఎన్జీవో వైస్ ప్రెసిడెంట్ వహీద్, సూర్యాపేట జిల్లా ఏఈవో లు పాల్గొన్నారు.



