Monday, December 23, 2024
[t4b-ticker]

టికెట్టు రాలేదు అని బాధ లేదు.అవతలి వ్యక్తిని బాధ పెట్టే ఆలోచన లేదు.. అద్దంకి దయాకర్.

- Advertisment -spot_img

*అద్దంకి నీ మాటకు ఎవరు సాటి..*

*టికెట్ దక్కకపోయినా నైరాశ్యం శూన్యం*

*అధిష్టానంపై నీ ఆత్మవిశ్వాసం భేష్…*

*పార్టీ అభ్యర్థి మందుల సామెల్ కోసం ప్రచారం చేస్తానన్న ప్రకటన శభాష్…*

*తుంగతుర్తి నియోజకవర్గంలో అందరి నోట అదే మాట*

*సూర్యాపేట జిల్లా నుండి విశ్లేషణ..*                            సూర్యాపేట జిల్లా(mbmtelugunews ప్రతినిధి శోభన్ బాబు)తుంగతుర్తి నియోజక వర్గం: మొదట ఆయన ఉద్యమ నాయకుడు ఆయన నైపుణ్యాన్ని వాక్చాతుర్యాన్ని చురుకుతనాన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం 2014లో పిలిచి మరి తుంగతుర్తి ఎస్సి జనరల్ స్థానానికి ఆయనను అభ్యర్థిగా కేటాయించింది స్వల్ప తేడాతో ఓటమి చెందారు ఆ తర్వాత పిసిసి అధికార ప్రతినిధిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నియమించింది పార్టీ వేదికల మీద టీవీ చానల్స్ లో పార్టీ తరఫున గొంతు వినిపించే బాధ్యత చాన చక్కగా నిర్వర్తించారని పేరు ఉంది.ఆ తర్వాత నిర్వహించిన 2018 మధ్యంతర ఎన్నికల్లో మరోసారి తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఈసారి కూడా అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయినా బాధపడకుండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని విజయవంతం చేస్తూ వచ్చారు ఈసారి 2023 శాసనసభ ఎన్నికల్లో మరోసారి తుంగతుర్తి నుంచి తనకే టికెట్ వస్తుందని ఆశించారు దానికి తగ్గట్టే వివిధ సర్వేలు చానల్స్ లలో చివరి నిమిషం దాకా ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది.అయితే కాంగ్రెస్ అధిష్టానం సామాజిక కోణంలో ఆయన కాకుండా ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన మందుల శ్యామూల్ కు టికెట్ కేటాయించింది.ఇక్కడ టికెట్ దక్కని వ్యక్తి అద్దంకి దయాకర్ అయితే అందరూ అద్దంకి దయాకర్ తిరుగుబావుట అభ్యర్థిగా బరిలో ఉంటారని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటారని అధిష్టాన నిర్ణయమే అంతిమమని అంటూ తాను అధిష్టానం ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థి మందుల శ్యాముల్ విజయానికి కృషి చేస్తానని సోనియాగాంధీకి,మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లకు తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించి కాంగ్రెస్ అధిష్టానంపై తన విశ్వాసాన్ని చాటారు.రెండుసార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి మూడవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తది అన్న సర్వేల రిపోర్టుల నడుమ తనకి తప్పకుండా టికెట్ వస్తుందని ఆశించిన అద్దంకి దయాకర్ టికెట్ రానందుకు రెబల్గా ఖచ్చితంగా పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు.కానీ రెండుసార్లు పోటీ చేసిన మూడోసారి టికెట్ ఇవ్వనందుకు కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబావుట ఎగరవేయకుండా తన విశ్వాసాన్ని చాటారు.

*టికెట్ ఆశించిన వారికి అద్దంకి ఒక రోల్ మోడల్*

కాగా పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గత ఏడాది నుంచి పలు సర్వేలు నొక్కి ఒక్కా నుంచి చెబుతున్నాయి.ఈ నడుమ సహజంగానే ప్రతి నియోజకవర్గ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా రెండు నుంచి మూడు మంది పోటీ పడ్డారు. అయితే అందరికీ ఒకటి నియోజకవర్గ నుండి టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి అధిష్టానం టికెట్ దక్కని వారిని బుజ్జగించడం సహజమే ఒకరిని పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయించడం లేదా అధికారంలోకొస్తే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటం ఎరగవేయటం సహజమే కానీ టికెట్ దక్కదని తెలిసిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ అధిష్టానం మీద నిప్పులు చేరగకుండా హుందాగా తన విశ్వాసాన్ని ప్రకటించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.కానీ ఎంతమంది టికెట్ దక్కని వారు అధిష్టానానికి విశ్వాసపాత్రులుగా ఉంటారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఏది ఏమైనా అద్దంకి దయాకర్ నేటి రాజకీయ తరానికి రోల్ మోడల్ గా చెప్పుకోవచ్చు

*రేవంత్ రెడ్డికి అత్యంత సన్నితుడు*

కాగా అద్దంకి దయాకర్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.అయితే అందరూ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి అద్దంకి దయాకర్ కు పక్కాగా టికెట్ లభిస్తుందని భావించారు. తుంగతుర్తి నుంచి పదుల సంఖ్యలో టికెట్ను ఆశించిన వారి సంఖ్య ఉంది ఇందులో పక్కాగా అద్దంకి దయాకర్ కు టికెట్ వచ్చినట్టేనని రాజకీయ వర్గాలు భావించాయి కానీ కాంగ్రెస్ అధిష్టానం తుంగతుర్తి,సూర్యాపేట నియోజకవర్గం అభ్యర్థులను తామే ప్రకటిస్తామని చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపింది.నామినేషన్ సమర్పణకు రేపు చివరి రోజు అనగా 9న రాత్రి 10 గంటలకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది తుంగతుర్తి నియోజకవర్గoలో ప్రకటించిన అభ్యర్థిని చూసి ఆశ్చర్య పోవడం రాజకీయ వర్గాల వంతైయ్యింది.కాగా రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాబోతున్నందున అద్దంకి దయాకర్ కు మంచి భవిష్యత్తు ఉండబోతుందని ఆయన సానుభూతి పరులు , నియోజకవర్గ ప్రజలు బహిరంగా చర్చలు జరుపుకుంటున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular