టీఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు
Mbmtelugunews//సూర్యాపేట,మార్చి14(ప్రతినిధి మాతంగి సురేష్):తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో హోలీ పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఉద్యోగులందరూ రంగులను ఒకరికొకరు ఆత్మీయంగా పూసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా టీఎన్జీఎస్ యూనియన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక హోలీ అని రంగుల కలయికతో కుల మతాల కతీతంగా అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగనే హోలీ అని,రంగుల లాగానే మన జీవితాలు కూడా ఆనందంగా ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు మడి పడక సైదులు,బచ్చలకూరి శ్రీనాథ్,టీజీవో నాయకులు డాక్టర్ బట్టు గోపి,అంబేద్కర్,దర్శనం మల్లేశం,చిన్న శ్రీరాములు,షేక్ హుస్సేన్,వల్దాసు నాగేందర్,సజ్జన్ కుమార్,సైమన్,రామ్మూర్తి,యాదగిరి,నాగార్జున,నకరికంటి రాములు,వెంకట్,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.



