టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
Mbmtelugunews//కోదాడ,మార్చి 10(ప్రతినిధి మాతంగి సురేష్):టీఎన్జీవో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపుమేరకు స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఎన్జీవో కార్యదర్శి విక్రమ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల వారు బాధ్యతగా సభ్యత్వాలు తీసుకోవడంతోపాటు సభ్యత్వాలు చేయించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.అన్ని శాఖల వారు విధిగా సభ్యత్వాలు తీసుకోవలసిందిగా కోరనైనది.ఈ కార్యక్రమంలో రమేష్,శ్రీనివాస్,లక్ష్మణ్,సునీత,రాధిక,పావని,మంచ్యా నాయక్,మంజుల తదితరులు పాల్గొన్నారు.