టీఐఎన్జీవో సూర్యాపేట జిల్లా కమిటీ ఏర్పాటు. .
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 15 (ప్రతినిధి మాతంగి సురేష్) టీఐఎన్జీవో కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు మొట్టమొదటి సరిగా నీటిపారుదల శాఖ సూర్యాపేట యందు టీఐఎన్జీవో అధ్యక్షులు షేక్ జానిమియా, టీఐఎన్జీవో జిల్లా కార్యదర్శి శ్యామ్ ఆధ్వర్యం లో ది 13.02.2024 న ఎన్నికలు నిర్వహించారు.ఇట్టి ఎన్నికలలో సూర్యాపేట లో పనిచేస్తున్న వెంకట భూపతి అధ్యక్షులుగా,సీనియర్ అసిస్టెంట్ కోదాడ నందిపాటి రవి కార్యదర్శి గా ఎన్నికయ్యారు.డిపార్ట్మెంట్ పరముగా ఉద్యోగుల పక్షంగా నిలబడి పోరాటం చేస్తామని,నిరంతరం తోడుగా ఉండి అన్ని పనులు పూర్తి చేసుకుంటామని తెలియజేసారు.ఇట్టి కార్యక్రమం లో సూర్యాపేట జిల్లా అసోసియేట్ అధ్యక్షులు నాయని ఆకాష్ వర్మ,జిల్లా ఉపాధ్యక్షులు వాసు ప్రకాష్,తిరుమలగిరి డివిజన్ అధ్యక్షులు సిహెచ్ షాలోము రాజు,బందంగి సూపరింటెండెంట్,పులి శ్రీను,సతీష్ గెలుపొందిన కార్యవర్గం,ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.