టీజీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ కోదాడ డిపో కమిటీ సమావేశం
: ఈడిని సత్కరించిన యూనియన్ సభ్యులు
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):టీజీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ కోదాడ డిపో కమిటీ సమావేశం స్థానిక సిపిఐ భవన్లో బుధవారం నిర్వహించుకోవడం జరిగినది. అనంతరం కార్మికుల సంక్షేమం కోసం ఈడి కుషుర్ షఖాన్ ని కోదాడ డిపో మేనేజర్ కార్యాలయంలో టిజిఎస్ ఆర్టిసి కోదాడ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారు కోదాడ డిపోలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో సత్కరించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి ఆర్ఎం జాన్ రెడ్డి, రీజనల్ అధ్యక్ష,కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ లు,కోదాడ డిపో కమిటీ సభ్యులు కేవి రత్నం, అంజలి, రాంబాబు, రాంమూర్తి, సంజయ్ గాంధీ, జ్యోతి, భాగ్యారావు, శ్రీను, పెయింటర్ శ్రీను, భిక్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.



