కోదాడ,నవంబర్ 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:టిపిసిసి క్యాంపెయినింగ్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా కోదాడకు చెందిన తెలంగాణ మున్సిపల్ కౌన్సిలర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు,కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ న్యాయది కేఎల్ఎన్ ప్రసాద్ నియామకం అయ్యారు.శనివారం రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమిస్తూ ఆ కమిటీ రాష్ట్ర చైర్మన్ మధుయాష్కి గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కోదాడలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి కి, మధు యాష్కి గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.కాగా కేఎల్ఎన్ ప్రసాద్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు,టీపిసిసీ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు,మైనార్టీ నాయకులు షేక్ బషీర్ తదితరులు పాల్గొన్నారు..
టీపిసిసీ క్యాంపెయినింగ్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా కేఎల్ఎన్ ప్రసాద్ నియామకం.:కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా:కేఎల్ఎన్ ప్రసాద్
RELATED ARTICLES



