ట్వినింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమం నిర్వహణ….
:పట్టణంలో పాఠశాలల మధ్య భాగస్వామ్యం, సమన్వయం ఉండాలి……..
:కోదాడ మండల విద్యాధికారి ఎండి .సలీం షరీఫ్…..
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 19 (ప్రతినిధి మాతంగి సురేష్) పట్టణంలోని జిల్లా పరిష త్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినీలు తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల(టిజిఎంఆర్ ఏస్ బాలికలు )కోదాడను ట్వినింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సందర్శించడం జరిగింది.కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడినారు.పట్టణంలో ఉన్న పాఠశాలలో సందర్శన భాగస్వామ్యం సమన్వయం పునర్వ్యవస్థీకరణ వ్యూహంలో భాగంగా ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం తెలియజేశారు.ఆయా పాఠశాలల్లో విద్యా విధానం,తరగతి గదులు,బోధనా పద్ధతులు,విద్యాసామర్ధ్యాలు, పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు,లైబ్రరీ,సైన్స్ ల్యాబ్,ఆట స్థలము,విద్యార్థుల ప్రవర్తన, క్రమశిక్షణ,విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రత్యేకతలను ప్రత్యక్షంగా సందర్శించి,విద్యార్థులు ఉపాధ్యాయులతో ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకోవడం ఉపయోగకరమైన కార్యక్రమాన్ని స్పష్టంగా వివరించారు.పాఠశాలలో విద్యాపరమైన మెరుగైన పరిస్థితులను తెలుసుకొని తమ పాఠశాలలో ఆచరించడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వహణ ద్వారా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కోసం మెరుగైన విధానాలు రూపకల్పనకు దారితీస్తుందని అభిప్రాయపడినారు.బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు తెలంగాణ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి అక్కడ విద్యార్థుల క్రమశిక్షణ,ప్రవర్తన,లైబ్రరీ నిర్వహణ,సైన్స్ ప్రయోగశాలలు,భోజన వసతి గదులు పరిశుభ్రత,ఆంగ్ల భాష పట్ల విద్యార్థులకు ఉన్న అవగాహన తదితర విషయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం నిర్వహణలో టిజిఎంఆర్ఎస్ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ మాధురి,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయులు పద్మావతి,పద్మ,సరిత,బడుగుల సైదులు,బాలస్వామి,విద్యార్థినిలు పాల్గొన్నారు.