డప్పు మోగించాలంటున్నా మాదిగ జర్నలిస్టులు.
:డప్పుతో దరువు వేద్దాం… ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం.
:హలో మాదిగ జర్నలిస్ట్ చలో హైదరాబాద్.
:లక్ష డబ్బులు… వేయి గొంతులు సభకు తరలిరావాలి…
Mbmtelugunews//కోదాడ,జనవరి 19 (ప్రతినిధి మాతంగి సురేష్):హైదరాబాదులో ఫిబ్రవరి 7వ తారీకున లక్ష డప్పులు వెయ్యి గొంతుల సభకు మాదిగ జర్నలిస్టులందరూ హాజరుకావలని ఎంజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పిడమర్తి గాంధీ,రాష్ట్ర నాయకులు బంకా వెంకటరత్నం లు అన్నారు. మాదిగ జర్నలిస్టుల ఆధ్వర్యంలో స్థానిక బాయ్స్ హై స్కూల్ లో ఎంజెఎఫ్ రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి తోటపల్లి నాగరాజు సభాధ్యక్షతన సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులు ఎంజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పిడమర్తి గాంధీ,రాష్ట్ర నాయకులు బంకా వెంకటరత్నం లు పాల్గొని మాట్లాడారు.లక్ష డప్పులు వేల గొంతుల మహా ప్రదర్శన కు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మాదిగ జర్నలిస్టు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపుని పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలోనే వర్గీకరణ సాధకుడైన మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో సమాజానికి డప్పు మాదిగ మేల్కొల్పు కోసం,అస్థిత్వ దరువులను మోగించాలని అన్నారు.వర్గీకరణ సాధన త్వరిత గతిన అమలుజేయాలనే ఫిబ్రవరి 7న హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్వహిస్తున్న లక్ష డప్పులు-వేల గొంతులై ఎం జె ఎఫ్ సూర్యాపేట జిల్లా తరఫున వెయ్యి డప్పుల కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ విజయవంతం చేయాలన్నారు.అలాగే కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మాదిగ జర్నలిస్టుల నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రఘు పడిశాల ,మాతంగి సురేష్,చీమ చంద్రశేఖర్,ఏపూరి సునీల్,మందుల రాంబాబు,నేలమర్రి శ్రీకాంత్,తోళ్ల గురునాథం తదితరులు పాల్గొన్నారు.