కోదాడ,ఏప్రిల్ 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజి యాదవ్ అన్నారు.భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతగిరి మండలం వాయల సింగారం గ్రామంలో వంగవీటి శ్రీనివాస రావు,పగిడి రామారావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డా,,అంజి యాదవ్ పాల్గొని పతాక ఆవిష్కరణ నూతన కార్యాలయాన్ని ప్రారంభించినారు. అనంతరం పార్టీలో జాయిన్ అవుతున్న 20 మందికి పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాలకు ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై కిందిస్థాయి కార్యకర్తలు కూడా బిజెపి పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు.రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికలలో 17 సీట్లకు 17 సీట్లు బిజెపి గెలుస్తుందని అన్నారు.కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు గూడపూరి అంకారావు,బుర్ర వెంకటేశ్వర్లు,గోపి,బుర్ర సత్యం,తెలగపల్లి లక్ష్మణ్,చింతకాయల మధు,వీరబోయిన లోకేష్,గరిడేపల్లి కనకయ్య,పగిడి నాగయ్య,కొల్లు శ్రీను,నలమాల అన్నం,వెంకన్న తదితరులు బిజెపిలో జాయిన్ అయ్యారు.ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు ఏలేటి వెంకటేశ్వర్ రెడ్డి,రామాచారి,శేఖర్ నాయుడు,కతిమాల వెంకన్న ,గుంజ నవీన్,పవన్,సాయి,గోపి,నవీన్,చంటి తదితరులు పాల్గొన్నారు.



