డాక్టరేట్ అందుకున్న బుస్సా సురేష్ ను అభినందించిన యం యస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సీఈఓ యస్ యస్ రావు.
Mbmtelugunews జగ్గయ్యపేట,డిసెంబర్ 2 (ప్రతినిధి మాతంగి సురేష్)జగ్గయ్య పేట వాగ్దేవి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బుస్సా సురేష్ ఇటీవల నాగార్జున విశ్వ విద్యాలయం నుండి వృక్ష శాస్త్రం లో పీహెచ్డీ పొందిన సందర్భంగా సోమవారం నాడు జగ్గయ్యపేట లోని వాగ్దేవి మహిళా కళాశాల లో శాలువాతో అభినందించి శుభాకాంక్షలు తెలిపిన యంయస్ విద్యా సంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి,సీఈఓ యస్ యస్ రావు.ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ క్రమ శిక్షణతో అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి విద్యార్థులలో మంచి స్థానాన్ని పొంది,అవార్డు అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.