Tuesday, July 8, 2025
[t4b-ticker]

డాక్టర్ కొండ విజయ్ కు నేస్తం సామాజిక వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం..

డాక్టర్ కొండ విజయ్ కు నేస్తం సామాజిక వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం..

Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్)తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ కవుల పాత్ర అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పట్టా పొందిన కొండ విజయ్ కుమార్ కి
బుధవారం కోదాడ పట్టణంలో మైత్రీ కంప్యూటర్ నందు నేస్తం సామాజిక వేదిక,మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేస్తం సామాజిక వేదిక కన్వీనర్ ప్రముఖ న్యాయవాది ఉయ్యాల నర్సయ్య, సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ మాట్లాడుతూ
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని నారాయణ పురంకు చెందిన కొండ విజయ్ కె.ఆర్. ఆర్. కాలేజీ,ఓయూ లలో ఉన్నత చదువులు కొనసాగించి,మాజీ విద్యార్థి నాయకుడు(ఎస్ఎఫ్ఐ), గా పని చేసి ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో గ్రూప్-2 ఉద్యోగి(జేఏసీ) గా వున్నారు.ఎంఏ.(ఏకనామిక్స్),ఎంఏ.(తెలుగు), బిఎడ్ చేసి,ప్రొ.తూర్పు మల్లారెడ్డి
మార్గదర్శంలో పీహెచ్ డీ చేసి డాక్టరేట్ పట్టా పొందారు అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు
కొండ వెంకటేశ్వర్లు,పుట్టా వెంకటేష్,సోమపంగు గణేష్,మోలుగురి నాగరాజు,గడ్డం లింగయ్య,గుండు విజయ రామారావు,మండవ మదు,చిన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular