Saturday, February 28, 2026
[t4b-ticker]

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షా కేంద్రాన్ని పరిశీలన……

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షా కేంద్రాన్ని పరిశీలన……

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 28(ప్రతినిధి మాతంగి సురేష్):కెఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్ష కేంద్రాన్ని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్, ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10 కేంద్రాల్లో యూజీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మార్చి 4 నుండి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరుగుతున్నాయని, మాస్ కాపీయింగ్ అవకాశం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నాగిరెడ్డి, కోఆర్డినేటర్ జి సైదులు, జర్నలిజం విభాగం డాక్టర్ యాదగిరి గౌడ్, సైదిరెడ్డి, ఫ్రాన్సిస్, ఎస్ఎం రఫీ, జాక్టో సురేష్, అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular