డాక్టర్ మాగి జానకిరామ్ నేషనల్ ఎమర్జెన్సీ ఫిజీషియన్ ఆఫ్ ది ఇయర్ -2024 అవార్డుకి ఎంపిక
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,అక్టోబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):శుక్రవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆర్గనైజేషన్ కమిటీ ఎన్ హెచ్ డబ్ల్యూఏ,ఎన్ఈబిఏ వారు నేషనల్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సమితి 2024 హోటల్ రాడిసన్ బ్లూ ద్వారకాలో జరిగిన అవార్డు ప్రధానోత్సవ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని గౌరవ్ గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు రాజ్ కుమార్ ఆనంద్,ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్ గౌట్ ఆఫ్ ఢిల్లీ
డా,,జీతూ లాల్ మీనా ఎన్ఎంసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ వాలి కార్డియాలజిస్ట్ చేతుల మీదుగా
నారాయణపురం గ్రామం చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా,వాసి మాగి సర్వయ్య నాగమణిల ప్రధమ పుత్రుడు అయిన డాక్టర్ మాగి జానకిరామ్ (ఎంబిబిఎస్ ఎమర్జెన్సీ ఫిజీషియన్) ఎమర్జెన్సీ విభాగంలో నేషనల్ ఎమర్జెన్సీ ఫిజీషియన్ ఆఫ్ ది ఇయర్ -2024 ఇవ్వడం జరిగింది.
డా,, జానకి రామ్ మాట్లాడుతూ అవార్డు పొందుటకు ముఖ్యకారకులైన నా తల్లిదండ్రులకు,తబస్సు,జేలీబు,ముదిత్,ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
ధన్యవాదాలు అని తెలియజేస్తూ
నా కల నెరవేరింది అని చెప్పడం జరిగింది.