డాక్టర్ సిరిపురపు సురేంద్రకు జిల్లా ఉత్తమ సేవా పురస్కారం
Mbmtelugunews//కోదాడ,జనవరి 26( ప్రతినిధి మాతంగి సురేష్ ): కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలోని ప్రాథమిక పశు వైద్యశాలలో పశువైద్య శస్త్రచికిత్సకులుగా పనిచేస్తున్న డాక్టర్ సిరిపురపు సురేంద్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రమును అందుకున్నారు.డాక్టర్ సురేంద్ర గత 9 సంవత్సరాలుగా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖలో విశేష సేవలందిస్తున్నారు. తన వృత్తి జీవితంలో నారాయణపేట జిల్లాలో మూడు ఏళ్లు, సూర్యాపేట జిల్లాలో ఆరు ఏళ్లుగా విధులు నిర్వర్తించారు.ప్రస్తుతం కాపుగల్లులో గడిచిన 4 ఏళ్లుగా సేవలందిస్తూనే, అనంతగిరి మండల పశువైద్యాధికారిగా అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా, అత్యవసర సమయాల్లో కోదాడ, అనంతగిరి మండలాల్లోని మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి పశువులకు ప్రాణదానం చేస్తున్నారు. పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణ. మండల వ్యాప్తంగా అన్ని రకాల టీకాల కార్యక్రమాలు, నట్టల నివారణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పశుపోషకులకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. తన సేవలను గుర్తించి అవార్డు అందించడం పట్ల డాక్టర్ సురేంద్ర హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో పశుపోషకుల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.



