డిఎస్పి శ్రీధర్ రెడ్డిని సన్మానించిన కోదాడ టౌన్ , హుజూర్ నగర్ సీఐ లు
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్):నేర పరిశోధనలో అత్యున్నతమైన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా,సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ డీఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి కి 2024 సంవత్సరానికి “కేంద్ర హోమ్ మంత్రి దక్షత పతాకాన్ని” ప్రకటించడం జరిగింది. శుక్రవారం కోదాడ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ని కోదాడ టౌన్ సీఐ టి.రాము, హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆలోచన మేరకు అభినందించడానికి వచ్చే వారు శాలువాలు బొకెలు తీసుకురావద్దని నోట్ బుక్ లు,పెన్నులు తీసుకురావాలని సూచించడంతో నోట్ బుక్ లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి కి అందజేయడం జరిగిందని తెలిపారు. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి భవిష్యత్ లో ఇంకా ఎన్నో పతాకాలు పొందాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ కార్యాలయ సిబ్బంది,టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.