కోదాడ,ఏప్రిల్ 19(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట పట్టణంలో జిల్లా కోర్టు నందు శుక్రవారం జిల్లా జడ్జి ఎస్ రాజగోపాల్ ను నూతనంగా ఎన్నికైన కోదాడ బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా కోదాడలో నూతన కోర్టు భవనం సముదాయ నిర్మాణ పనులను,పైలట్ ప్రాజెక్టు కింద మంజూరైన శోచాలయాలు (టాయిలెట్స్) త్వరగా నిర్మాణం చేపట్టాలని,సబ్ కోర్టుకు కావలసిన మౌలిక సదుపాయాలైన ఏసి,కూలర్స్,ఫర్నిచర్ ను కావాలని కోరినారు.దానికి వారు స్పందిస్తూ సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి,ఉపాధ్యక్షులు గట్ల నర్సింహారావు,ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి,సరికొండ హనుమంత రాజు,కోడూరి వెంకటేశ్వరరావు,మంద వెంకటేశ్వర్లు,హేమలత,దొడ్డ శ్రీధర్,సామా నవీన్,ఎస్ కే నాగుల్ పాషా,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలో సమాచారం ఏమైనా ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు.



