డీజేల నిషేధంపై,శాంతియుత ర్యాలీ చేపట్టిన డీజే యజమానులు.
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ,హుజూర్ నగర్,పాలేరు నియోజకవర్గాలలో ఉన్న డీజే యజమానులు కోదాడ పట్టణంలో సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా కోదాడ డివిజన్ అధ్యక్షుడు అనంతు లింగస్వామి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో డీజేలు నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే డీజేలను నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి వినతిపత్రం అందజేయడానికి వెళుతుండగా కోదాడ పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమని అన్నారు. డీజేలు నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని,తమ పొట్టకూటి కోసం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి డీజేలను పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని,తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ డీజే పాటలతో,తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్య పరచామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి,డీజేల నిషేధం వెంటనే ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో..గౌరవ అధ్యక్షులు వేణు,ఓం శీను,ఉపాధ్యక్షులు వజీర్,కోశాధికారి బంగారు,తులస,కార్యదర్శి పండు,సిద్దు,సలహాదారులు జానీ,నరేష్,వివిధ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు మూడు వందల మంది డీజే కమిటీ సభ్యులు పాల్గొన్నారు.