డెంటల్ విద్యార్థికి ఆర్థిక సాయం
Mbmtelugunews//కోదాడ,మర్చి 07(ప్రతినిధి మాతంగి సురేష్): ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డెంటల్ విద్యార్థికి కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. అనంతగిరి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన పెదపంగు శ్రీను కుమారుడు నిషాల్ కార్తీక్ హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఐతే ఆయన తండ్రి శ్రీను తీవ్ర అనారోగ్య సమస్యతో మంచానికే పరిమితం కావడంతో కార్తీక్ కు కళాశాల ఫీజు చెల్లించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి ఆ విద్యార్థికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ క్రమంలో మంగళవారం కత్రం ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో కోదాడలోని బాధితుడి ఇంటికి వెళ్లి రూ.35 వేల చెక్కును కార్తీక్ తల్లి దండ్రులకు అందించారు.ఈ కార్యక్రమంలో కత్రం చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులు, కిష్టాపురం గ్రామ పెద్దలు పాల్గొన్నారు.



