తన తల్లి నేత్రాలను దానం చేసిన గాదం శెట్టి శ్రీనివాసరావు…….
:పుట్టేడు దుఃఖంలో కూడా పదిమందికి మంచి చేయాలన్న సంకల్పం…..
:నేత్రదానంతో మరికొందరి జీవితాల్లో వెలుగులు………
:ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి. శ్రీనివాసరావు……..
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 23 (ప్రతినిది మాతంగి సురేష్):తల్లి చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా పదిమందికి మంచి చేయాలన్న సంకల్పంతో తన తల్లి నేతలను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు కోదాడ స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు. శనివారం తన తల్లి సీతారావమ్మ అనారోగ్యంతో బాధపడుతూ వారి నివాసంలో మృతి చెందారు. తల్లి చనిపోయిన బాధలో ఉండి కూడా తన తల్లి నేత్రాలు మరి కొందరికి ఉపయోగపడాలన్న సంకల్పంతో ఖమ్మం నేత్ర నిధి వారికి సమాచారం అందించడంతో వారు నేత్రాలను సేకరించారు. ఈ కార్యక్రమం లో ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఓరుగంటి కిట్టు, నాగుబండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చారుగండ్ల ప్రవీణ రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి యాద సుధాకర్, గుడుగుంట్ల సాయి, వెంపటి ప్రసాద్, పందిరి సత్యనారాయణ, ప్రభాకర్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు……….



