తమ్మర,కోదాడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 03:మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో మంగళవారం తమ్మర కోదాడ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామ చెరువు తెగి ఒక్కసారిగా వరదంతా అంతర్ గంగా వాగులోకి రావడంతో అంతర్ గంగా వాగు పొంగి కూచిపూడి గ్రామమును నీరు చుట్టుముట్టడంతో గ్రామ ప్రజలు నీటి మధ్యలో ఆగిపోయినారు.ఈ నీరు అనుకోకుండా ఒక్కసారిగా వాళ్ళ ఇండ్లలోకి రావడం వలన నిత్యవసరలకు సంబంధించిన వన్నీ పూర్తిగా నీట మునిగిపోవడంతో వాళ్లు తినడానికి తిండి,తాగడానికి నీరు లేక నానా ఇబ్బందులు పడుతుంటే తమ్మర,కోదాడకు చెందిన ఫ్రెండ్స్ కూచిపూడి గ్రామం వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
నీట మునగడంతో అన్ని రకాలుగా ఎంతో ఇబ్బంది పడుతుంటే మాకెంతో బాధాకరంగా ఉందని వారు అన్నారు.వారికి ఒక పూట అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తమ్మర,కోదాడ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు.