కోదాడ,ఫిబ్రవరి 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు తమ్మినేని సత్యనారాయణ ఆశయాలను సాధిద్దామని ఏఐటియుసి ప్రాంతీయ నాయకులు పోతురాజు సత్యనారాయణ,జీవి రాజు పిలుపునిచ్చారు.గురువారం తమ్మర గ్రామంలో ఉన్న స్థూపం వద్ద కుటుంబ సభ్యులు తమ్మినేని సరోజినమ్మ,రమేష్ ఆధ్వర్యంలో తమ్మినేని సత్యం 18వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు సామినేని నరేష్,పోతురాజు సత్యనారాయణ,సిపిఐ మండల కార్యదర్శి వార్డు కౌన్సిలర్ బత్తినేని హనుమంతరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోతురాజు సత్యనారాయణ జెండా ఆవిష్కరించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ తమ్మినేని సత్యనారాయణ గ్రామంలో పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.ఆయన ఆశయాలను నేటి యువత సాధించిన నాడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మాతంగి ప్రసాద్,నాయకులు కొండ కోటేశ్వరరావు,నిడిగొండ రామకృష్ణ,మాతంగి గాంధీ,బత్తినేని శ్రీనివాసరావు,నిడిగొండ శ్రిను,యర్ర లక్ష్మీనారాయణ,మందరపు బిక్షమయ్య,యర్ర సత్యం,గోవిందరావు,సర్వయ్య,షేక్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.



