తమ్మినేని రమేష్ ఆశయాలను సాధిద్దాం:బత్తినేని హనుమంతరావు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 30 (ప్రతినిధి మాతంగి సురేష్):కామ్రేడ్ తమ్మినేని రమేష్ ఆశయాలను సాధించిన నాడే మనము ఆయనకిచ్చే ఘన నివాళులు కోదాడ మండల సిపిఐ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు.కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామంలో రమేష్ నివాస గృహమునందు ఏర్పాటుచేసిన సంస్మరణ సభకు హనుమంతరావు ముఖ్యఅతిథిగా పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రమేష్ కుటుంబం అంతా కమ్యూనిస్టు పార్టీలో ఉండి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేసినారని ఆయన గుర్తు చేశారు.రమేష్ మృతి పార్టీకి తీరనిలోటుని తెలిపారు.రమేష్ ఆశయాలను సాధించిన నాడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళులు తెలిపారు.తమ్మర గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలు ప్రసాదు,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డా వెంకటయ్య,సిపిఐ నాయకులు కొండా కోటేశ్వరరావు,నిడిగొండ రామకృష్ణ,రాయపూడి కాటమరాజు,లాయర్ తూములూరి సీతారామరాజు,కుటుంబ సభ్యులు తమ్మినేని హనుమంతరావు,భ్రమరాంబిక, ప్రభాకర్,గిరిజ,సరోజినమ్మ తదితరులు పాల్గొన్నారు.