తమ్మినేని రమేష్ మృతి బాధాకరం,సిపిఐ పార్టీకి తీరనిలోటు:సిపిఐ కార్యదర్శి బత్తినేని
హనుమంతరావు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు తమ్మినేని రమేష్ మృతి బాధాకరమని,పార్టీకి గ్రామ శాఖకు తీరని లోటు అని కోదాడ మండల సిపిఐ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు,రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొల్లు ప్రసాద్,దొడ్డా వెంకటయ్య లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన తమ్మినేని రమేష్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా శనివారం తమ్మర గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్ ఆధ్వర్యంలో రమేష్ నివాస గృహానికి వెళ్లి పార్థివ దేహంపై ఎర్రజెండా కప్పి పూలమాలతో నివాళులర్పించారు.అనంతరం బత్తినేని హనుమంతరావు మాట్లాడుతూ తమ్మినేని రమేష్ మృతి బాధాకరమని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు.తమ్మినేని రమేష్ కుటుంబం అంతా కమ్యూనిస్టు పార్టీకి ఎనలేని సేవలు చేశారని అలాగే గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు.సంతాపాన్ని తెలియపరిచిన వారిలో పోతురాజు సత్యనారాయణ,కమతం పుల్లయ్య,బత్తినేని శ్రీనివాసరావు,గొట్టేముక్కల కోటి నారాయణ,కొండా కోటేశ్వరరావు,నిడిగొండ రామకృష్ణ,కమతం మురళి,పసుపులేటి గోవిందరావు,గోసు దిబ్బయ్య,మాతంగి గాంధీ,మాతంగి ఏసు,యలగందుల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.