కోదాడ,జులై 12(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు కావస్తున్న పాలకుల అవినీతి చీడ అంతం కావట్లేదని, తరతరాలుగా తిష్ట వేసిన అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా పనిచేస్తానని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఓయు జెఏసి అధ్యక్షులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు.పట్టణంలోని తన నివాసంలో మన ఊరుకు.. మన గడపకు… మన అంజన్న.. కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజి యాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో తరతరాలుగా తిష్ట వేసిన అవినీతిని, వారసత్వ రాజకీయాల రూపుమాపటానికి కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గడపగడపకు వెళ్లి కోదాడ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబ సభ్యులను కలవనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమము ఈనెల 14.07.2023 నుండి 27.08.223 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,కతిమాల వెంక్నన,ఏం బాబు,ఎస్ వంశీ,ఏం సాయి,నవీన్,ఎం గోపి,నాగరాజు, బండి గోపి,నిహాల్,కోటేష్,చంటి,సాయి గోపి,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
తరతరాలుగా తిష్ట వేసిన అవినీతిని రూపుమాపణమే లక్ష్యంగా పనిచేస్తాం: డాక్టర్ అంజి యాదవ్
RELATED ARTICLES