తెలంగాణ,ఏప్రిల్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:నిత్యం తననీ సంతలో సరుకులా బేరానికి కుదిర్చే..దళారులు దండలేసి దండం పెడ్తుంటే..
తండ్రి ఎంత తల్లడిల్లుతున్నడో.!?
చెంచాలంతాకల్సి తన మొఖం కన్పించకుండా పోటిపడి పూలతో ఉరిని బిగిస్తుంటే ఎంత వేదనకు గురౌతున్నాడో బాబాసాహేబ్!?
జాతిని తాకట్టు పెట్టెటోళ్ళంతా గుంపులుగా మోపై
జైభీమ్ జైభీమ్ అంటూ అరుస్తుంటే అంభేద్కర్ ఎంతగా కుమిలిపోతున్నాడో.!?
ఎలక్షన్లో కమీషన్లకు,పదవులకు ఆరాటపడే జాతి ద్రోహులంతా వచ్చి మైకులో దంచికొడ్తుంటే భారత రత్న మరెంత మౌనంగా ఉన్నాడో విగ్రహమై.!?
ఒక నవశకానికి నాంధిగా చెంచాలను ,దళారులను ద్రోహులను తరిమేయడమే నేటి అంభేద్కర్ కు ఘణ నివాళిగా…
అందరికీ బాబాసాహేబ్ అంభేద్కర్ జయంతి శుభాకాంక్షలు.
వరకుమార్ గుండెపంగు



