నల్గొండ జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నేను తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని శాలిగౌరారం మండలానికి చెందిన ఇటుకులపహాడ్ గ్రామాన్ని నేను గతంలో నకిరేకల్ నియోజకవర్గంలో ఉండేదాన్ని,నియోజకవర్గల పునర్విభజన జరిగిన సమయంలో నన్ను నన్నే కాదు మా మండలాన్ని మొత్తాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో కలపడం జరిగింది.నేను నకిరేకల్ నియోజక వర్గంలో ఉన్నపుడు మాధవరం నుండి నన్ను(ఇటుకులపహాడ్) చేరుకోవడానికి తారు రోడ్లు వేశారు.నేను ఎప్పుడైతే తుంగతుర్తి నియోజకవర్గం చేరామామో అప్పుడే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో మామండలంతో పాటు నేను (ఇటుకులపాడు ప్రజలు) ఉద్యమంలో ముందంజలో ఉండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటలో భాగస్వామిని అయ్యాను అని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను.కానీ నేను ఎంత గర్వపడ్డానో అంతే భంగపడ్డాను అని చెప్పుకోవటం సిగ్గు పడుతున్నాను,,,.ఎందుకిలా అంటున్నాను అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత అయిన నాకు మంచి రోజులు వస్తాయి అని సంతోషం వ్యక్తం చేశాను.కానీ నాపరిస్తితి తుంట ఎత్తేసి మొద్దేత్తుకున్నట్లే ఉందని భాదతో చెపుతున్న,.నాకడుపులో ఇంకా చాలా భాదలున్నాయి.కానీ ఇప్పుడు ఉన్న పెద్ద బాదే నన్ను చేరుకోవడానికి మార్గం సరిగ్గ లేక వచ్చి పోయే వాళ్ళు ఏమి ఊరు ఇది ఇక్కడికి రావాలంటేనే ఇష్ట పడటం లేరు.గత ప్రభుత్వం (బి.అర్.ఎస్) దశాబ్ద కాలం(దాదాపు పది సంవత్సరాలు)పాటు పరిపాన సాగిన అప్పటి ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ కు నాతరుపున నాబిడ్డలు(ఊరి ప్రజలు)ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కనికరించలేదు.అప్పటి నుండి నేను పడుతున్న ఇబ్బంది అంత ఇంత కాదు!ప్రభుత్వం మారితే అన్న నాకు మంచి కాలం వస్తుంది అని సంతోకరమైన ఆలోచన స్థానికేతరున్ని ఓడిస్తేనే నాకు మంచి జరుగుద్ది అని నా మండలం ప్రజ్జలకు అందరికీ నేనే నా ఊరి లోపలికి వచ్చే దారిని చేస్తే నా భాద ఏంటో మీకే తెలుస్తోంది ,స్థానిక బిడ్డనే స్థానిక ఎమ్మెల్యేగ గెలిపించుకునే మన భాధలు సాదకాలు తెలుకొని నాలాంటి ప్రతీ పల్లెను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారు అని ఆశపడి మందుల సామేలూ ను గెలిపించిన విషయంలో ప్రథమ పాత్ర పోయాడంలో నేను ముందు వరసలో ఉన్నాను అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలను.,అంతే కాదు నామండల బిడ్డ
చామల కిరణ్ కుమార్ రెడ్డి ని కూడ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకునే విషయంలో కూడా ముందంజలోనే ఉన్నాను అని సగర్వంగా తలెత్తుకొని చెపుతున్న.,! ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే మందుల సామేలూ స్థానికుడే,మంత్రి మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు చామాల కిరణ్ కుమార్ రెడ్డి స్థానికులే కావటం వలన నాకు ఈసారి మహర్దశ కలుగుతుంది అని గట్టినమ్మకంతో నేను ఉన్నాను అని ఇటుకులపాడుగ తల పైకి ఎత్తి చెపుతున్నాను.



