సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం:(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆహార్నిశలు కష్టపడిన మందుల సామెల్ కి మంత్రి పదవి ఇవ్వాలని తుంగతుర్తి మండల కాంగ్రెస్ దళిత నాయకులు పోలేపాక అంజయ్య కోరుతున్నారు. 50వేల రూపాయల నగదు లేకపోయినా 52,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన మందుల సామేల్ కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం. ఈనియోజకవర్గానికి కాంగ్రెస్ టికెటు సాధించి గెలిచిన తుంగతుర్తి నియోజకవర్గ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల స్వామేలుకి మంత్రి పదవి ఇస్తే తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఉంచుతారని తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల విటల్ చెడుపాక శ్రావణ్ కుమార్ పోలేపాక సతీష్ బొంకూరి రంజిత్ మరికంటి అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది.