నల్లగొండ జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు); నార్కట్ పల్లి పట్టణ కేంద్రానికి చెందిన ఒక దళిత మాల సామాజిక వర్గానికి చెందిన పురం సంతోష్ కుమార్ ఇయన మొన్న తెలంగాణ రాష్ర్టంలో జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో నకిరేకల్ ఎమ్మెల్యే గా మన తెలంగాణ సమైక్య పార్టీ అనే ఒక పార్టీ నుంచి పోటీ చేసి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీద ఓటమి చెందారు.గత ఇరవై ఐదు సంవత్సారాలు అనుభవం ఉన్న పురం సంతోష్ కుమార్ ఎక్కడ చూసినా దళితుల మీద అనేక రకాల మానసిక ఒత్తిడిలను అధిక డబ్బు ఉన్న పెత్తనం ఉన్న వారు రాజకీయాలను శాసిస్తున్న తరుణంలో ఆయనే సొంత పార్టీని స్థాపించలనే ఉద్దేశంతో గత మూడు సంత్సరాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ మధ్య కాలంలో “భారత యువశక్తి పార్టీ”పేరుతో పార్టీని రిజిస్టరు ప్రక్రియను ప్రారంభించారు.డబ్బు ఉన్న వారే రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నరని భావించి, నిరు పేదల రాజకీయ పార్టీ నీ నెలకొల్పాలని నిర్ణయించారు.ఇప్పుడున్న అన్ని రాజకీయ పరిస్తుల డబ్బు,మద్యం ప్రలోభాలకు గురి అవుతున్న నేపథ్యంలో కొత్త మార్పు కోసం కొత్త పార్టీని పెడుతున్నట్లు,రాబోయే రోజుల్లో ఈ యొక్క జాతీయ పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పోటీ చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను అమలు పరిచే విధంగా ఉండాలని కోరుతూ పార్టీ ప్రణాళిక అన్ని ఏర్పాట్లు పార్టీ వ్యవస్థాపకులు పురం సంతోష్ కుమార్ రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు.ఇప్పటికే ఢిల్లీ లెవల్లో పార్టీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పార్టీ అన్ని కులాలకు సంబంధించినదిగా పురం సంతోష్ కుమార్ మీడియా ప్రతినిధులకు బుధవారం రోజున తెలియ జేశారు.ఈ పార్టీ ప్రకియ పూర్తిగా అరు నెలల్లో పూర్తి అవుతుందని,వచ్చే ఏడాది జూన్ నెలలో పార్టీని ఉద్యమాల కీళ్ల పోరు గడ్డ నల్లగొండ జిల్లా గడ్డపై రెండు లక్షల మందితో పార్టీ ప్రకటన,పార్టీ “మేనిఫెస్టో”వీధి విధానాలు ప్రకటిస్తానని,ఈ పార్టీలో మాజీ మంత్రులు,ఎంపీ,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మేదావులు,పారిశ్రామిక వేత్తలు,కవులు,కళాకారులు,విద్యార్థి విభాగం నాయకులు,వివిధ కులాల నాయకత్వ నేతలు పాల్గొంటారని వ్యవస్థాపక అధ్యక్షులు పురం సంతోష్ కుమార్ మీడియాకు వెల్లడించారు.



