తెలంగాణ గెజిటెడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం 2026 డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
Mbmtelugunews//కోదాడ, మర్చి 10( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం 2026 డైరీ, క్యాలెండర్ ని కళాశాల ప్రిన్సిపల్ హదాసరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అధ్యాపకులు కళాశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు పదోన్నతులు కల్పించడంలోనూ, అధ్యాపకుల సర్వీస్ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషిచేసిన, సంఘం యొక్క ప్రతి ప్రాథమిక సభ్యుని సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్న సంఘం యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డికి అధ్యాపకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చందా అప్పారావు, సైదిరెడ్డి, నిర్మల కుమారి, మాతంగి యాకోబు, శ్రీలత, సైదులు తదితరులు పాల్గొన్నారు.



