సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)సూర్యాపేట, సెప్టెంబర్ 26: మహిళలందరికీ స్ఫూర్తినిచ్చిన పోరాట దీరవనిత చాకలి ఐలమ్మ అని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, అగ్గి కనకై రగిలి పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన దీరవనిత అని ఆమె పోరాట పటిమను ఎమ్మెల్యే కీర్తించారు.