కోదాడ,నవంబర్ 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:టిపిసిసి క్యాంపెనింగ్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నూతనంగా నియమింపబడ్డ కోదాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ న్యాయవాది కేఎల్ఎన్ ప్రసాద్ ను కోదాడ నియోజకవర్గ కౌండిన్య గౌడ సంఘం ప్రతినిధులు మరియు కేఎల్ఎన్ యువసేన మిత్ర మండలి సభ్యులు గజమాలతో శాలువాలతో పూల బొకేలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేఎల్ఎన్ ప్రసాద్ ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడు పాటు పడతారని ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజల అభివృద్ధి ఆకాంక్షిస్తారని కొనియాడారు.వీరి నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నియమించిన క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్ మధు యస్కి గౌడ్,నల్గొండ పార్లమెంటు సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఎన్ పద్మావతి రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా కేఎల్ఎన్ ప్రసాద్ కౌండిన్య గౌడ సంఘం ద్వారా గౌడ్లకు చేసిన మేలు అమోఘమని తెలిపారు.కేఎల్ఎన్ యువసేన మిత్రమండలి ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని వారు కొనియాడారు.కౌండిన్య గౌడ సంఘం నియోజకవర్గ ప్రతినిధులు సంపేట నరేష్ గౌడ్,మొక్క రమేష్ గౌడ్,కారింగుల అరవింద్ గౌడ్,పోలంపల్లి వీరేందర్ గౌడ్,మట్టపల్లి సాలయ్య గౌడ్,కాసాని వీరబాబు గౌడ్,దేశ గాని సాంబయ్య గౌడ్,గుండగాని పాపారావు గౌడ్,సోమగాని వీర వెంకట్ గౌడ్,బాలబోయిన కొండలు గౌడ్,బాలబోయిన వీరబాబు గౌడ్,ఎరగాని లింగయ్య గౌడ్,సోమగాని రవి,మొలుగూరి ఉపేందర్,భూసరాజు కార్తీక్,పొనుగోటి శివ,మహిళా ప్రతినిధులు బొడ్డుపల్లి సుమలత,చెరుకుపల్లి శోభ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపెయినింగ్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కె.ఎల్.ఎన్ ప్రసాద్ కు ఘన సన్మానం.
RELATED ARTICLES



