కోదాడ,ఆగష్టు 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి పాటుపడాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శనివారం కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణంలోని కట్టకొమ్ముగూడెం బైపాస్ వద్ద మొక్కలు నాటిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరితహారం అనే మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించించిందని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తెలంగాణలో అటవీ శాతం,గ్రీనరి శాతం ఘనంగా పెరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పగా అభివృద్ధిని సాధించిందని ఆయన అన్నారు.దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వకారణం అని తెలియరు.హరితహారం లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్జన కార్యక్రమం అద్భుతమైనదని ఆయన అన్నారు.ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం ఏర్పడింది. సకాలంలో వర్షాలు పడుతూ ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉన్నారు.తెలంగాణకు ముందు చుక్క నీరు లేని పరిస్థితుల నుంచి నీరు ఇక చాలు అనే దాకా వచ్చిందని అన్నారు.ఇదంతా సీఎం కెసిఆర్ వల్లే సాధ్యం అయిందని ఆయన అన్నారు.హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 7.7% గ్రీనరీ పెరిగింది.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి పాటుపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు,మున్సిపల్ అధికారులు,పట్టణ కౌన్సిలర్లు, అటవీ వివిధ శాఖల అధికారులు మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పగా అభివృద్ధిని సాధించింది:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.
RELATED ARTICLES



