తెలంగాణ,డిసెంబర్ 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గా నూతనంగా నియమితులైన డాక్టర్ రవీందర్ నాయక్ ని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిహెచ్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాదులోని వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజారోగ్య విభాగం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఎంతోకాలంగా ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేస్తున్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సీనియర్లను నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిహెచ్ విభాగం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహకి కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజారోగ్య విభాగంలో పెండింగ్లో ఉన్న సమస్యల సాధనకు తన వంతుగా కృషిచేసి వైద్యుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్,రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీన్ దయాల్,రాష్ట్ర నాయకులు డాక్టర్ లక్ష్మణ్,డాక్టర్ చంద్రశేఖర్,డాక్టర్ వెంకట మణి ,డాక్టర్ రవితేజ,డాక్టర్ యాదా రమేష్ ,డాక్టర్ వినోద్ ,డాక్టర్ బజన్ లాల్,విజయ్,డాక్టర్ భీమా నాయక్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గా నూతనంగా నియమితులైన డాక్టర్ రవీందర్ నాయక్ కి శుభాకాంక్షలు
RELATED ARTICLES



