తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కవచాల స్కిల్ టెస్ట్
కౌండిన్య గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు కెఎల్ఎన్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపిన గౌడ సంఘం సభ్యులు
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాటమయ్య రక్షణ కవచాల స్కిల్ టెస్ట్ లను మంగళవారం పట్టణ పరిధిలోని కట్టకొమ్ముగూడెం రోడ్ లో నిర్వహించారు.అనంతరం గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీలో కౌండిన్య గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు కెఎల్ఎన్ ప్రసాద్ ఎనలేని కృషి చేశారని అన్నారు.గత 5 సంవత్సరాల కంటే ముందు తాత,ముత్తాతలకు ఉన్న లైసెన్సులే తప్ప యువతకి నూతన లైసెన్సులు మంజూరు కాలేదని అన్నారు.కోదాడ,హుజూర్ నగర్ నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి నేను ఉన్న అని భరోసా ఇచ్చి లైసెన్సులు ఇప్పించడం జరిగిందని గౌడ కులస్తులు పేర్కొన్నారు.సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 60 శాతం లైసెన్సు లు కెఎల్ఎన్ ప్రసాద్ ఇప్పించడం జరిగిందని అన్నారు.లైసెన్సు లేని వారు ఎవరైనా ఉంటే తమకు తెలియజేస్తే కెఎల్ఎన్ ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్ళి నూతన లైసెన్సు మంజూరు అయ్యేలా చూస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.