తెలంగాణ రాష్ట్ర మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా
:భాషబోయిన భాస్కర్ ముదిరాజ్.
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 28(మనం న్యూస్): మండల పరిధిలోని ఎర్రవరం గ్రామానికి చెందిన భాషబోయిన భాస్కరరావు ను ఆదివారం హైదరాబాదులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ చేతుల మీదుగా నియామక పత్రము అందజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో భాషబోయిన భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులను ఒక తాటిపై తీసుకొని వచ్చి ముదిరాజు సంఘమును బలోపేతం చేస్తానని ముదిరాజులను బిసి-డి నుంచి బిసి-ఏ లోకి మార్చుటకు గాను ముదిరాజులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయుటకు మత్స్య సహకార సంఘాలను బలోపితం చేయుటకు కృషి చేస్తానని వారు అన్నారు. నా నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నా నియమకానికి సహకరించిన వారు మనముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు చార్మినార్ ఏసీపీ మాజీ బుడిగి అంజయ్య, వాయిల సింగారం మత్స్య సహకార సంఘం మాజీ చైర్మన్ గుండ్లపల్లి వెంకన్న, బోళ్ల కరుణాకర్, తమ్మనబోయిన గోపి, రాజు తదితరులు పాల్గొన్నారు.



