తెలంగాణ రైజింగ్ – యంగ్ ఇండియా.
:ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం.
:విద్యార్థులకు.. ఉల్లాసం విజ్ఞానం, వినోదం.
:బాల్యం ఆట, పాట, మాటతో గడపాలి.
:వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
:ఎండి సలీం షరీఫ్,కోదాడ మండల విద్యాధికారి.
కోదాడ,మే 06(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలోని పీఎం శ్రీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సారధ్యంలో “తెలంగాణ రైజింగ్ – యంగ్ ఇండియా” ఉచిత వేసవి శిక్షణ శిబిరం” ప్రారంభం జరిగింది. కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడుతూ బాల్యం ఆట,పాట మాట,మంచి నడవడికతో గడపాలని,తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులలో “తెలంగాణ రైజింగ్ – యంగ్ ఇండియా” శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడంముఖ్యంగా నృత్యం,చిత్రలేఖనం,వాలీబాల్,శాస్త్రీయ వైఖరులు,వ్యక్తిత్వ వికాస నిర్మాణం అంశాల పట్ల శిక్షణ ఇవ్వడం వలన మానసిక,శారీరిక దృఢత్వం ఏర్పడుతుందని,విద్యార్థులకు జీవన నైపుణ్యాలతో మంచి అలవాట్లు,నడవడిక ఏర్పడతాయన్నారు.విద్యార్థులు ఉల్లాసంగా విజ్ఞానంతో వినోదభరితంగా సెలవులను సద్వినియోగపర్చుకోవాలని కోరారు.6వ నుండి ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరానికి హాజరు కావచ్చు అన్నారు.శిక్షణకు వచ్చే విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు.ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు వివిధ విభాగాలలో ప్రావీణ్యత కలిగిన వాలంటీర్లతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,వి మీనాక్షి,ఈ శ్రీనివాసరెడ్డి,ఏ పద్మావతి,ఎస్ కె ఖజామియా,ఎం జానకి రామ్,బడుగుల సైదులు,సురేషు,శిక్షణ వాలంటీర్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,క్రీడాకారులు పాల్గొన్నారు.