కోదాడ,ఆగష్టు 16 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:టీ టీడీపీ తెలుగు రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోదాడ నివాసి కొల్లు వెంకటేశ్వరరావును టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమించారు.ఈ సందర్భంగా కొల్లు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్,జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు,తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాపా కృష్ణమోహన్ రావు,టిడిపి నల్లగొండ పార్లమెంట్ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, కోదాడ అసెంబ్లీ ఇంచార్జ్ ఓరుగంటి ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలియజేసారు.రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై రైతు ఉద్యమాలు నిర్వహించి వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తానని చెప్పారు.
తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొల్లు వెంకటేశ్వరరావు
RELATED ARTICLES



