తెలుసు కదా’.. చిత్రీకరణ మొదలు!
సినిమా, ఆగష్టు07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:’డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన తన తదుపరి చిత్రం ‘తెలుసు కదా’ కోసం రంగంలోకి దిగారు.నీరజ కోన దర్శకురాలిగా పరిచయమ వుతున్న ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.రాశీ ఖన్నా,శ్రీనిధి శెట్టి కథానాయికలు.ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది.దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరించనున్నారు.కొత్తదనం నిండిన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో సిద్ధు స్టైలిష్ లుక్లో కనిపించనున్నారు.ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నారు.జ్ఞానశేఖర్ బాబా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.