తేజ టాలెంట్ పాఠశాలలో మహిళ ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు.
Mbmtelugunews//కోదాడ,జనవరి 03 (ప్రతినిధి మాతంగి సురేష్)స్థానిక తేజ టాలెంట్ పాఠశాలలో ఉపాధ్యాయులు,విద్యార్థులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలతో అలంకరించి, మహిళ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయినిలు మాట్లాడుతూ, దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అయిన సావిత్రిబాయి పూలే జయంతిని, రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడానికి హర్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అప్పారావు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి,కుల వివక్ష,పితృ స్వామిక పీడనలపై పోరాడిన వీరనారి,మహిళల విద్యకై పూణేలో 1848 వ సంవత్సరంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించిన వనితగా సావిత్రిబాయి పూలే యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ సోమనాయక్, ఇన్చార్జులు రామ్మూర్తి,రేణుక,మహిళా ఉపాధ్యాయులు విజయ,నవ్య,సునీత, క్రిష్ణవేణి, పావని, సరితలు పాల్గొన్నారు.