తేజ టాలెంట్ స్కూల్ యందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Mbmtelugunews//కోదాడ ఆగష్టు 15 ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.పాఠశాలకు ముఖ్య అతిథిగా ఇదే పాఠశాల యందు చదువుకుని ప్రస్తుతం కోదాడలో వైద్యులుగా సేవలందిస్తున్న డాక్టర్ కుందూరి అజిత (ఎండి),వారి భర్త రాజమోహన్ రెడ్డిలు హాజరయ్యారు.తాను పాఠశాలలో చదువుకున్న అనుభూతులను గుర్తు చేసుకుంటూ,ఎన్ని అవరోధాలు వచ్చిన చదువును నిర్లక్ష్యం చేయవద్దని,అదే మన జీవితాలను నిర్మిస్తుందని దానికి తన జీవితమే ఉదాహరణ అంటూ రేడియాలజిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ అజిత తెలియజేశారు.తాను 15 సంవత్సరాల క్రితం చదువుకున్న ఉపాధ్యాయులు నేటికీ పాఠశాలలో పనిచేస్తుండటం నాకు చాలా తృప్తినిచ్చిందని తెలిపారు.తేజ పాఠశాలలో ఆడుతూ పాడుతూ చదివానని,ఒత్తిడి లేని చదువు కావాలని,కార్పొరేట్ స్కూల్ లలో,కాలేజీల్లో ఒత్తిడితో చదవాల్సి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రామచంద్ర మిషన్ జోనల్ ఇన్చార్జి సిహెచ్ వరప్రసాద్,ప్రిన్సిపాల్ ఎం అప్పారావు,రామ్మూర్తి,సొసైటీ సెక్రటరీ వై సంతోష్ కుమార్ పాల్గొన్నారు.