తేజ పాఠశాలలో ఆంగ్ల భాష దినోత్సవ వేడుకలు…
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 13(ప్రతినిధి మాతంగి సురేష్)స్థానిక తేజ టాలెంట్ పాఠశాలలో ఆంగ్లభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.ఇటీవల ప్రభుత్వం సరోజినీ నాయుడు జయంతిని ఆంగ్లభాష దినోత్సవంగా జరుపుకోవాలనే ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యార్థులకు సరోజిని నాయుడు జీవిత చరిత్రపై వ్యాసరచన,ఉపన్యాస పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అప్పారావు సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి,తెలంగాణ గడ్డ అయినా హైదరాబాదులో పుట్టి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని,అనేక కవితలు,రచనలను ఆంగ్ల భాషలో రచించి భారతకోకిలగా పేరు గాంచిన వీర వనితగా సరోజినీ నాయుడును కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ వై సంతోష్ కుమార్,వైస్ ప్రిన్సిపల్ సోమ నాయక్,ఇన్చార్జులు రామ్మూర్తి,రేణుక,ఆంగ్ల ఉపాధ్యాయులు అశోక్,రమేష్,నవ్య,నాగమణి,గోవిందు పాల్గొన్నారు.