తేజ పాఠశాలలో చిన్నారుల హోలీ సంబురాలు.
Mbmtelugunews//కోదాడ, మర్చి 02( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారి విద్యార్థులు ఒకరి ఒకరి మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా చిరు మందహాసంతో రంగులు పూసుకుంటూ రంగోలి నిర్వహించారు. బుడిబుడి నడకలు వేస్తూ కిండర్ గార్డెన్ లో చదువుతున్న చిన్నారులు సహతం ఆధ్యంతం రంగోలి సంబరాల్లో మునిగి తేలారు. పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జానకి రాములు, సెక్రటరీ సంతోష్ కుమార్, ఇంచార్జి రేణుక, నవ్య, కృష్ణవేణి, శైలజ, ఆశలత, రేణుక, గణేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



