తేజ పాఠశాలలో స్నేహితుల దినోత్సవ వేడుకలు
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 02 (ప్రతినిధి మాతంగి సురేష్)ఆగస్టు మూడో తేదీన జరుపుకునే స్నేహితుల దినోత్సవంను స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుండి స్నేహితుల ద్వారా మంచి లక్షణాలు పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ అప్పారావు తెలిపారు. శనివారం పాఠశాలలో అన్ని క్లాసులో విద్యార్థులు అత్యంత ప్రేమ, అనురాగాలతో ఇతర విద్యార్థులను స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒకరికొకరు అభినందించుకుంటూ, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్నారు. పాఠశాలలో పండుగ వాతావరణంలో ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్, సెక్రటరీ సంతోష్ కుమార్, ఇన్చార్జులు రామ్మూర్తి, నవ్య , రేణుక, వెంకటేశ్వర్లు, రమేష్, రాంబాబు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



