తేజ విద్యార్థుల వినూత్న ప్రదర్శన
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 24(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని,దేశ,రాష్ట్ర,కోదాడ ప్రజలకు విద్యార్థులు హ్యాపీ క్రిస్టమస్ అని వినూత్న రీతిలో కూర్చుని శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు మేరీమాత,శాంతా క్లాస్ వంటి వేషధారణలలో పిల్లలను అలరించారు.

ఈ ఏర్పాటుకు పాఠశాల పిఈటి రాంబాబు,వెంకట్,రమేష్,సునీత,గణేష్,గోవిందు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్,ప్రిన్సిపల్ అప్పారావు,వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్,ఇన్చార్జులు రామ్మూర్తి,రేణుక,విద్యార్థుల తల్లిదండ్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.