తేజ స్కూల్ విద్యార్థుల హోలీ సంబరాలు…
Mbmtelugunews//కోదాడ,మార్చి 14(ప్రతినిధి మాతంగి సురేష్):పట్టణంలోని స్థానిక తేజ టాలెంట్ స్కూల్ హాస్టల్ విద్యార్థుల రంగుల హోలా హోలీ తేజ పాఠశాల విద్యార్థులు సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా హోలీ పండుగను జరుపుకోవడం జరిగింది హోలీ జరుపుకోవడం విద్యార్థులకు ఎంతో సంతోషంగా ఉంది.. ఘనంగా నిర్వహించిన హోలీ సంబరాలలో ప్రతి ఒక్కరు ఆనంద సంతోషాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని అదేవిధంగా హోలీ పండుగ సందర్భంగా యువత ఆడంబరాలకు గాని యువత వేగంగా బైకులు నడపటం విన్యాసాలు చేయటం వంటివి చేయకుండా ఇంటి వద్ద స్నేహితులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని కోరారు.విద్యార్థులు,ఉపాధ్యాయులు సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సోమనాయక్ ఇన్చార్జి రామ్మూర్తి,రమేష్,వెంకటేశ్వర్లు,రాంబాబు,సరిత,కవిత మొదలగువారు పాల్గొన్నారు.



