Friday, December 26, 2025
[t4b-ticker]

తొగర్రాయి గ్రామంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు ఘన స్వాగతం పలికిన నాయకులు,ప్రజలు

కోదాడ,నవంబర్ 12(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మరోసారి కోదాడ గడ్డ పై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయం అని కోదాడ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం కోదాడ మండలంలో ని తొగర్రాయి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో అయన పాల్గొని మాట్లాడుతూ…….కోదాడ ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగింది. ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అని ఆయన తెలిపారు.కంటి ముందు అభ్యర్థి ఇంటి ముందు అభివృద్ధి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేను. ఎప్పుడూ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసమే పాటు పడుతున్నాను అని ఆయన తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో, మ్యానిఫెస్టో విడుదలలో,ప్రచారంలో ఎట్లైతే ముందు ఉందో రేపు జరిగే ఎన్నికల్లో కూడా విజయం సాధించడంలో బిఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అని అన్నారు.బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయింది అని తెలిపారు.

కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు,రైతుబంధు,ఉచిత కరెంటు,ఆసరా పెన్షన్ వంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తుంది అని తెలిపారు.అదే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకి,హామీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్యారెంటీ అని ఆయన అన్నారు.వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం,అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న బీఆర్ఎస్ మేనిఫెస్టో అని ఆయన తెలిపారు.తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా..
ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా ఇవ్వడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.తెలంగాణ అన్నపూర్ణ పథకం’ పేరుతో… తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు.ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేయడం జరుగుతుంది అని తెలిపారు.వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంపు,రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు,మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇవ్వడం జరుగుతుంది.సౌభాగ్య లక్ష్మీ పథకం
అర్హులైన ప్రతి మహిళకు రూ.3,016లు భృతి,ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.అర్హులైన వారికి రూ’.400లకే గ్యాసి సిలిండర్,అక్రిడేషన్ కార్డున్న ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు.ఆరోగ్య లక్ష్మీ పెంపు ఆరోగ్య లక్ష్మీ రూ.15లక్షలకు పెంచడం జరుగుతుంది అని ఆయన అన్నారు.బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం,దళిత బంధు కొనసాగింపు జరుగుతుంది అని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత వేగంగా అభివృద్ది చెందిన రాష్ట్రం లేదు అని అన్నారు.ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ది వదిలేసి కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మరు అని తెలిపారు.28 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని వారు తెలిపారు.గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలతో ఉన్నాం అని ఆయన అన్నారు.అనంతరం గ్రామంలోని వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular