Tuesday, December 24, 2024
[t4b-ticker]

తొగర్రాయి గ్రామం లో పర్యటించి వరద నష్టం పై ప్రజలకు భరోసా నిచ్చిన… కలెక్టర్

- Advertisment -spot_img

తొగర్రాయి గ్రామం లో పర్యటించి వరద నష్టం పై ప్రజలకు భరోసా నిచ్చిన… కలెక్టర్

:అధికారులు అందరు రేపటి నుండి హౌజ్ టూ హౌజ్ సర్వే చేయాలి……

:వైద్య సిబ్బంది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేపట్టాలి….

:జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 04:వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.బుధవార కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో వరద వల్ల తెగిపోయిన రోడ్డు,బ్రిడ్జి,వరద ప్రభావం చూపిన ప్రతి బజారు లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రెండు గంటల పాటు పర్యటించి ప్రతి ఒక్కరి సమస్య విని వారందిరికి సహాయం చేస్తానని కలెక్టర్ అన్నారు.ముందుగా తెగిపోయిన బ్రిడ్జి ని పరిశీలించి రేపు ఉదయం కల్లా తాత్కాలింగా మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పంచాయతీ రాజ్ ఇంజనీర్ అధికారులను ఆదేశించారు.పూర్తిగా గాని, పార్సికంగా గాని దెబ్బ తిన్న ఇండ్లను,వరద నీరు ఇంటిలోకి వచ్చిన సామాగ్రి కొట్టుకోనిపోయిన ఇండ్లను,నీట మునిగిన పంటలు,చనిపోయిన పశువులు,మేకలు,గొర్రెలను లెక్కించుటకు గురువారం ఉదయం 9 గంటల నుండి హౌజ్ టూ హౌజ్ సర్వే జరరుగుతుందని అక్కడికి వచ్చిన అధికారులకు మీకు కలిగిన నష్టం ను తెలియపర్చాలని అధికారులు వాటిని రాసుకొని నివేదిక అందించగానే ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.వరద వచ్చిన అర్ధరాత్రి రోజు నుండి తొగర్రాయి గ్రామం గురించి ప్రత్యేకంగా అధికారులను అడిగి తెలుసుకుంటునానని కలెక్టర్ అన్నారు.వరద ప్రభావం తో కూలిన మిర్యాల బాబు,రామిశెట్టి శ్రీను,నామాల సాయిలు ఇండ్లను అలాగే వరద ప్రభావంకి గురైన దేవాలయ ఆవరణంను కలెక్టర్ పరిశీలించారు.గ్రామం లో పంచాయతీ సిబ్బంది 25 మందితో కలిసి ప్రతి బజార్ లో,ప్రతి ఇంటికి బ్లీచింగ్ పౌడర్ వెదజల్లాలని,యాంటీ లార్వా స్ప్రే చేయాలని,వీధులను పరిశుభ్రం చేయాలని,మురికి నీటిలో దోమలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు రేపటి లోపు క్లోరినేషన్ పరీక్ష చేసి ప్రజలకు త్రాగునీరు అందించాలని మిషన్ భగీరథ ఎఈ ని ఆదేశించారు.వైద్య సిబ్బంది టీమ్ లుగా ఏర్పడి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేపట్టాలని అలాగే 15 రోజులలో 3 సార్లు ఫీవర్ సర్వే చేయాలని,సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త లు తీసుకోవాలని డిప్యుటీ డియం హెచ్ఓని ఆదేశించారు.అలాగే గ్రామం లో పల్లె దావఖానా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ తో మాట్లాడాలని ఎఈ ని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో ఆర్డిఓ సూర్యనారాయణ,డిప్యూటీ డియమ్ హెచ్ఓ నిరంజన్,ఎయన్ యమ్ లు,అంగన్వాడీ టీచర్లు,ఆశా వర్కర్లు,గ్రామ పెద్దలు,యువత,తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular