తోటి ఫోటోగ్రాఫర్లకు ఆర్థిక సహాయం అందజేత
ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం చేయూతనివ్వాలి…..
కోదాడ,మే 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఫోటో గ్రాఫర్లకు ప్రభుత్వం చేయూతను అందించి ఆదుకోవాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మంగళవారం కోదాడ పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్ కు, దొరకుంట గ్రామానికి చెందిన మరొక ఫోటోగ్రాఫర్ కు ఆ సంఘ కుటుంబ భరోసా నిధి నుండి ఇరువురి కుటుంబాలకు పదివేల రూపాయల చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ లను ప్రభుత్వం గుర్తించి ఆపదలో ఉన్న వారిని ఆదుకొని చేయూతను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ తోటి ఫోటోగ్రాఫర్లకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ భరోసా అనే ఒక పథకాన్ని రూపొందించి తెలంగాణలో ఏ ఫోటోగ్రాఫర్ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఘనత తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ది ఫోటోగ్రాఫర్లు ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ఆపదలో ఉన్న తోటి ఫోటోగ్రాఫర్లను ఆదుకునేందుకు ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుంకుంట్ల లాలు,కోదాడ అధ్యక్షులు పిల్లుట్ల వెంకట్,ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్,గొట్టం రవి,నగేష్,ఉపేందర్,సప్తగిరి,కలర్ ల్యాబ్ వాసు,శ్రీరామ్,పద్మ ఆర్ట్ శ్రీను,ఎస్ఎస్ శ్రీను,హరీష్ రమేష్,అహ్మద్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.



